![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసామవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -825 లో... ఇంట్లో అందరు భోజనం చేస్తుంటారు. అపర్ణ స్వరాజ్ ని మీద కూర్చోపెట్టుకొని భోజనం తినిపిస్తుంటుంది. అది చూసి రేవతి ఎమోషనల్ అయ్యి, బయటకు వెళ్తుంది. తన వెనకాలే రాజ్, కావ్య వెళ్తారు. నాకు చాలా హ్యాపీగా ఉంది.. తన మనవడిని ప్రేమగా చూసుకుంటుందని రాజ్, కావ్యలతో రేవతి అంటుంది.
ఆ తర్వాత రాజ్, కావ్య, రేవతి తిరిగి ఇంట్లోకి వెళ్తారు. ఏమైందని అపర్ణ అనగానే.. వాళ్ళ అమ్మగారు దూరంగా ఉంటారట.. నువ్వు అలా ప్రేమగా వాడిని దగ్గరికి తీసుకుంటే వాళ్ళమ్మ గుర్తు వచ్చిందట అని రాజ్ చెప్తాడు. నన్ను కూడా మీ అమ్మ అనుకోమని అపర్ణ అంటుంది. ఎలాగైనా రేవతి ముసుగు తీయాలని రుద్రాణి శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. కావాలనే రేవతిపై రుద్రాణి వాటర్ పోసి ముసుగు తియ్యబోతుంటే.. అప్పుడే అపర్ణ కోప్పడుతుంది.
మరొకవైపు కావ్య గురించి డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకొని అప్పు బాధపడుతుంది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. కావ్య పడిపోతుంటే రాజ్ చూసి మెల్లిగా కడుపులో నా బిడ్డ ఉందని అంటాడు. మన బిడ్డ అని కావ్య అంటుంది. వాళ్లని చూసి పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కంటున్నారని కళ్యాణ్ తో అప్పు అంటుంది. ఆ తర్వాత సాయంత్రం సరదాగా చీటీ గేమ్ ఆడుతారు. చీటీ లో వచ్చింది చెయ్యాలి. తరువాయి భాగంలో ముసుగులో వచ్చింది రేవతి అని అందరికి తెలిసిపోతుంది. నాకు ముందే తెలుసని అపర్ణ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |